![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -397 లో.. కృష్ణ, ముకుంద, మురారీ, ఆదర్శ్ కలిసి కార్ లో రెసాట్ కి వెళ్తారు. అక్కడికెళ్ళి రూమ్ లు ఉన్నాయా అని అడుగగా.. ఆ రెసాట్ మేనేజర్ మీరు హైదరాబాద్ నుండి వస్తున్నారు కదా అని అడుగుతాడు. ఇక కృష్ణ, మురారీ అంతా అవునని చెప్తారు. అయితే మీకు ఆల్రెడీ రూమ్ లు బుక్ చేశారు. పేమెంట్ కూడా అయిపోయింది.. ముకుంద పేరు మీద బుక్ చేశారని ఆ రెసాట్ అతను చెప్పగానే అందరు షాక్ అవుతారు.
మరోవైపు ఇంట్లో ఉన్న రేవతి దగ్గరికి మధు వచ్చి మాట్లాడుతుంటాడు. నాకెందుకో ముకుంద నటిస్తుందనిపిస్తుందని చెప్పగా.. అన్ని అనుమానాలు పెట్టుకోకని రేవతి అంటుంది. అది కాదు పెద్దమ్మ.. ఆదర్శ్ వచ్చినప్పుడు కూడా ముకుంద అంత సంతోషంగా లేదు కానీ ఈ ట్రిప్ కి వెళ్తున్నప్పుడు ఓ తెగింపు చూశానని, నా అనుమానం నిజమైతే ఓ డెసిషన్ తో వస్తారు. అది పాజిటివ్ కంటే నెగెటివ్ అయ్యే ఛాన్సే ఎక్కువ అని రేవతితో మధు అంటాడు. ఆ తర్వాత రేవతి ఆలోచనలో పడుతుంది. మరోవైపు రెసాట్ లో ఉన్న కృష్ణ, మురారీ వారి గదిలో మాట్లాడుకుంటారు. ఈ రోజు మనల్ని ఎవరు ఆపలేరు. రూమ్ కి తాళం వేసి కిటికీ నుండి బయట పడేశానని మురారీ అనగానే కృష్ణ షాక్ అవుతుంది. ఎందుకిలా చేశారు మనం బయటకెలా వెళ్ళాలని కృష్ణ టెన్షన్ పడుతుండగా రూమ్ బాయ్ వచ్చి రూమ్ క్లీనింగ్ అని బయట నుండే అడుగుతాడు. దాంతో రూమ్ తాళం పోయిందని కృష్ణ అనగానే మా దగ్గర స్పేర్ కీ ఉంది తీసుకొస్తామని అతను వెళ్ళిపోతాడు. ఇక మరో గదిలో ఉన్న ముకుంద దీర్ఘంగా ఆలోచిస్తుంటుంది. నాకు తెలియకుండా నా పేరు మీద ఎవరు రూమ్ లు బుక్ చేశారని ముకుంద అనుకుంటుండగా.. వాళ్ళ అన్నయ్య కాల్ చేస్తాడు. ఏంటే మీ ఆయనతో శోభనం చేసుకోవడానికి వచ్చావా అని అడుగగా.. ఆదర్శ్ మీద ప్రేమ రాదు ఇష్టం రాదని ముకుంద అంటుంది. నాకు తెలియకుండా నా వెనక ఏదో జరుగుతుందిరా, నా పేరు మీద రూమ్ బుక్ చేశారు.. ఎవరో తెలియట్లేదని ముకుంద అనగానే.. ఇంకెవరు ఆ కృష్ణే.. తనే కదా నీకు అడ్డు అని ముకుంద వాళ్ళ అన్నయ్య అనగానే.. నువ్వు మాత్రం ప్రాణలు తీయాలనే పిచ్చి పిచ్చి ఆలోచనలేమీ పెట్టుకోకు.. కృష్ణ మంచిది అని ముకుంద ఫోన్ మాట్లాడుతుంటే అక్కడికి ఆదర్శ్ వస్తాడు. దాంతో వెంటనే కాల్ కట్ చేస్తుంది ముకుంద.
ఎవరితో మాట్లాడుతున్నావని ఆదర్శ్ అడుగగానే.. మా అన్నయ్య అని చెప్తుంది ముకుంద. కాసేపటికి రూమ్ క్లీనింగ్ చేయడానికి రూమ్ బాయ్ రాగా.. కాస్త వెయిట్ చేయండి మేమ్ ఫ్రెషప్ అవ్వాలని ముకుంద అతనికి చెప్పి ఆదర్శ్ ని ఫ్రెష్ అవ్వమని పంపిస్తుంది. ఇక కాసేపటికి ముకుంద, ఆదర్శ్, కృష్ణ మురారీ అంతా బయట ఒకే టేబుల్ దగ్గర కూర్చుంటారు. మందు ఆర్డర్ చేస్కొని తాగుంతుంటారు. కాసేపటికి ఆదర్శ్ కి అతని బెస్ట్ ఫ్రెండ్ కాల్ చేశాడని ఫోన్ పట్టుకొని పక్కకి వెళ్తాడు. మరోవైపు ఇంట్లో ఉన్న రేవతి దీర్ఘంగా ఆలోచిస్తుంటుంది. అప్పుడే మధు వచ్చి ఏం ఆలోచిస్తున్నావని అనగానే.. ఆ ముకుంద మారిందా? మారలేదా? అని అనుకుంటున్నానని రేవతి అంటుంది. తను మారలేదు.. ఆల్రెడీ ఒకసారి తప్పు చేసింది అయిన అందరు క్షమించారు కానీ ఈ సారీ నేను క్షమించనని చంపేస్తానని మధు ఆవేశంగా చెప్పి వెళ్ళిపోతాడు. తరువాయి భాగంలో ఆదర్శ్ ఫోన్ మాట్లాడుతుంటే అక్కడికి ముకుంద వెళ్ళి.. తన మనసులో మురారీనే ఉన్నాడని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |